Tuesday 30 December 2014

హిందూ ధర్మ ప్రహేళికలు-చారిత్రక విషాదం!

      అసలు హిందూ ధర్మమే ఒక వైపు నుంచి చూస్తే చాలా సరళంగానూ మరోవైపు నుంచి చూస్తే గహనంగానూ కనిపిస్తుంది!బట్టనెత్తి బాలయ్య అట్టకన్నా దిట్టమయిన విగ్గు పెట్టి "ఒక వైపే చూడు!రెండో వైపు చూడకు - తట్టుకోలేవ్,చచ్చిపోతావ్" అంటే అది సినిమా గాబట్టి డయరెక్టరు చెప్పాడు గాబట్టి అమ్రిష్ పురి అయినా సరే దడుచుకున్నట్టు నటించాల్సిందే,అట్టా చెయ్యకపోతే నిర్మాత డబ్బులిస్తాడా?కానీ పాపం హిందూ ధర్మానికి ఆ రకం సీను లేదాయె!ప్రతీ అడ్దగాడిదకీ లేకువైపొయింది?

      ఒకప్పుడు విదేశీయుల దృష్టిలో ఇది - పాముల నాడించే వాళ్ళ దేశం?కావమ్మ మొగుడంటే కామోసని అందరూ నమ్మేసారు, కాదని వాదించేవాడు లేడు గదా!కానీ చరిత్ర మరొక పిక్చరు చూపిస్తాంది?ఇంగ్లీషోడు మనని ఆక్రమించుకున్న కొత్తల్లోనే మన దేశం నుంచి వెళ్ళిన ఒక నౌకకి అక్కడ లంగరెయ్యగానే అక్కడి వాళ్లకి గుండెలు గుభేలు మన్నయ్,ఇంత పెద్ద నౌకని చూట్టం వాళ్ల జన్మకదే మొదటి సారి మరి!దాంతో ఇంగ్లీషోళ్ళు మనల్ని దెబ్బతియ్యటానికి చేసిన మొదటి పని మన నౌకల్ని నిషేధించటం!

    ఇంగ్లీషు వాళ్ళకన్నా ముందు ప్రపంచ దేశాల్లో "మేడిన్ ఇండియా" అనే మాటకి ఇవ్వాళ "మేడిన్ అమెరికా" మరియూ "మేడిన్ జప్యాన్" అనే మాటల కన్నా యెక్కువ దమ్ము వుంది!మహానౌకలు అని పిల్చేవాళ్ళు భారతీయ నౌకల్ని!వాళ్లలా దేశాల్ని రాజకీయంగా ఆక్రమించి తమకి అనువుగా ప్రభుత్వాల్ని మార్చుకుని చేసిన దివాళాకోరు వ్యాపారం కాదు మనం చేసింది,సరుకులో నాణ్యత చూపించి సాధించిన మోనోపలీ అది!

     17వ శతాబ్దంలో జాన్ డాల్టన్ కనుక్కున్న అణుధర్మ శాస్త్రం గురించి డాల్టన్ కన్న 2,500 సంవత్సరాలకి పూర్వమే ఆచార్య కణాదుడు ఇక్కడ ప్రతిపాదించాడు!అది యేదో భంగు మత్తులో వుండి వాగిన సొల్లు కాదు,అతని అసలు పేరు కశ్యపు డయితే ఈ సిధ్ధాంతం పేరు మీద కణాదు డనేది బిరుదుగా వచ్చింది!ఈ ఋషి క్రీ.పూ 600లో ఇప్ప్పటి గుజరాతు లోని అప్పటి ప్రభాస క్షేత్రంలో జన్మించాడు.ఈ విశ్వమంతా అతి చిన్న అంశమయిన కణములు లేదా అణువులతో నిర్మించ బడింది అనీ,ఆ కణాన్ని అంతకన్నా చిన్న భాగాలుగా విడగొట్టలేము అనీ సిధ్ధాంతం లాగా వివరించి చెప్పాడు.కానీ మనం మాత్రం అణుధర్మ శాస్త్ర పితామహుడిగా జాన్ డాల్టన్ మహాశయుణ్ణే కీర్తిస్తాం.

     "భూమికి గల ఆకర్షణ వల్ల వస్తువులు భూమి పైన పడుతున్నాయి.ఇదే ఆకర్షణ వల్ల భూమి,ఇతర గ్రహాలు,నక్షత్ర సమూహాలు,సూర్యుడు,చంద్రుడు తమ తమ కష్యలలో పరిభ్రమిస్తున్నాయి" - ఇది మనం న్యూటన్ పేరు మీద గురుత్వాకర్షణ శక్తి నియమంగా చదువుకుంటున్నాం.కానీ ఈ మాటలు క్రీ.శ 400-500 మధ్యన జీవించిన భాస్కరాచార్యు డనే భారత దేశపు ఖగోళ శాస్త్రవేత్త రచించిన "సూర్య సిధ్ధాంత" మనే గ్రంధం లోనివి!ఇది మనకి ఐజాక్ న్యూటన్ ద్వారా 1200 సంవత్సరాల తర్వాత తెలిసింది?

   పాశ్చాత్య శరీరధర్మశాస్త్రం ఇంకా శైశవదశలోనే వున్న వెనకటి కాలంలోనే ఇక్కడి వాడయిన ఆచార్య చరకుడు ఎనాటమీ,ఎంబ్రియాలజీ,ఫార్మకాలజీ శాఖలకి సంబంధించిన యెన్నో విషయాల్ని విపులంగా చెప్పాడు!మధుమేహం, హృదయ సంబంధమయిన వ్యాధుల గురించి యెన్నో విషయాలు చెప్పాడు!ఇక క్రీ.శ 499లోనే తన "ఆర్యభటీయం"లో గ్రహగతుల గురించీ గ్రహణాలు యేర్పడే విధం గురించీ వ్యాఖ్యానించాడు!కోపర్నికస్ ద్వారా మనం తెలుసుకున్న దానికి 1000 సంవత్సరాలకు ముందే భూమి గుండ్రంగా వుంటుందనీ అది సూర్యుడి చుట్టూ ఒక అక్షం మీద పరిభ్రమిస్తుందనీ చెప్పాడు?2600 సంవత్సరాలకు పూర్వమే శుశ్రుత మహర్షి సిజేరియన్,క్యాటరాక్ట్,ప్లాస్టిక్ సర్జరీ,బ్రైన్ సర్జరీ లాంటి యెన్నో క్లిష్తమయిన శస్త్ర చికిత్సలు చేశాడు!

      శ్రీమధ్భాగవతం లోని 3వ కాండ 30వ అధ్యాయంలో వర్ణించిన తల్ల్లి గర్భంలో శిశువు యెదిగే దశల్ని ఇవ్వాళ మనం చూసే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ వివరాలతో పోల్చి చూస్తే రెంటిలోనూ యెన్నో పోలికలు కనపడతాయి!గురు పాదుకా స్తవంలో శక్తిని "నాద బిందు కళాధరీ" అని కీర్తించారు!చందస్సుకి సరిపోతుందని వేసిన వ్యర్ధ పదం కాదది - ఇవ్వాళ బౌతిక శాస్త్రవేత్తలు మూలకాల్ని గుర్తు పట్టటానికి రిసొనేటింగ్ ఫ్రీక్వెన్సీ, స్పెక్త్రోఫోటోమెట్రీ, అటామిక్ వెయిట్  అనే మూడింటిని పరీక్షలుగా తీసుకుంటున్నారు!

   వేదగణితం గురించి కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ చేసిన గొడవ ఇంకే దేశంలో నైనా యెవరయినా చేస్తే జాతిద్రోహుల కింద జమకట్టి  జనమే తన్ని తగలేసే వాళ్ళు!ఇక్కడ గాబట్టి మేధావులుగా చెలామణీ అవుతూ గౌరవాలు పొందుతున్నారు?అసలు ఇవ్వాళ ప్రపంచంలో మనం ఫాలో అవుతున్న అంకగణితంలో మనవాళ్ళు చేసింది కేవలం సున్నాని కనిపెట్టట మొక్కటే కాదు - ప్రాధమిక నియమాలు కూడా మనవాళ్ళు చెప్పినవే!

    సున్నాని కనిపెట్టడం కూడా ఆర్కిమిడ్డీసు లాగా నీళ్లతొట్టెలో పడుకుని వూగుతుండగా హట్ఠాత్తుగా తెలిసొచ్చి "యురేఖా తకమిఖా" అని పాడుకుంటూ వొంటిమీద బట్ట వుందాలేదాని కూడా చూసుకోకుండా రెచ్చిపోయినట్టు జరగలేదు!దైవానికీ జీవుడికీ వుందే సంబంధాన్ని అందులో నిక్షేపించారు!శూన్యాంకం మరియూ పూర్ణాంకం అని రెండు పేర్లతోనూ పిలిచే ఈ గుర్తుకి సొంతంగా విలువ లేదు,కానీ మరొక అంకెకి కుడిపక్కన అంటే ముందువైపుకి చేరితే దాని విలువని పదింతలు పెంచుతుంది.భగవంతుణ్ణి చూడగలిగిన మనిషి విలువ గురించిన సూచన అది!అసలు 1 నుంచి 9 వరకూ వున్న అంకెలన్నీ 1కి బహురూపాలే!అంటే అక్కడ వున్నవి రెండే రెండు - '1" మరియూ "0".ఇవ్వాళ కంప్యూటర్లలో వాడుతున్న బూలియన్ ఆల్జీబ్రా చెప్పే "బీయింగ్" మరియూ "నథింగ్" అనే సిధ్ధాంతానికి మూలరూపం కూడా ఇందులోనే వుంది?!అలాంటిది యెంత కష్టమయిన లెక్కనయినా పేపరు మీద వేసుకుని అంచెల వారీగా చెయ్యాల్సిన పని లేకుండా,కనీసం కాలిక్యులేటరు కూడా వాడకుండా మనస్సులోనే చెయ్యగలగడం వల్ల మన పిల్లలు యెంత చురుగ్గా తయారవుతారు అనేది కూడా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యతిరేకించారు,యేమి దౌర్భాగ్య మిది?

     ఇతర్లు కనుక్కున్న వాట్ని మనవాళ్ళు ముందే కనుక్కున్నా ఇంకా ఇతర్ల పేరు మీదనే చదువుతున్నాం.ఈ దగుల్బాజీ తనం పేరు సెక్యులరిజం,మోడర్నిటీ!ఒక ఫ్రెంచ్ మహిళ - పెద్దగా పేరున్న మనిషి కూడా కాదు,మన దేశంలోని ప్రాచీన విజ్ఞానం గురించి కొంచెం తెలియగానే "ఇదే మా దేశపు వాళ్ళు కనిపెడితే ప్రపంచం పొలిమేరలు గింగురుమనేలా అరిచి గోల చేసయినా సరే గుర్తింపు తెచ్చుకునేవాళ్ళం" అనేసింది!

    నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను!ప్రజ బ్లాగులో గీత గురించి ఒక ప్రశ్న వేస్తే కొందరితో వాదన మొదలెట్టాక క్షేమంగా ఇందులోంచి బయట పడగలనా,యెరక్కపోయి ఇరుక్కున్నాను గదా అని పరితపించాల్సిన దుస్థితి యెదుర్కొన్నాను?మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలనుకోకుండా రెండు మూడు ముక్కల్ని, అది కూడా వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు నాకు గీత గురించిన చర్చల్లో యెదురయినాయి.

     Einstein విశ్వంలో వంపుదారే తిన్ననిదారి అని చెప్పాడు అని ముక్తాయించి వొదిలేస్తే యెలా వుంటుంది?ఆ వొక్క ముక్క చుట్టూరా ఆయన యేం చెప్పాడో దాన్ని యెలా సమర్ధించాడో తెలియకపోతే ఆ ముక్క అర్ధమవుతుందా యెవరికయినా!మనకి సాంప్రదాయికంగా వున్న పండగల్లో ప్రతిదానికీ ఒక నక్షత్రం క్షితిజం మీదకి రావటం వుంటుంది కదా!అది అక్కడికి యెందుకొస్తుంది?విశ్వంలో సూర్యమండలం,నక్షత్రరాశులూ వాటి సొంత వేగాలతో వాటి మానాన అవి పరిభ్రమిస్తుంటే భూమి మీద నుంచి చూస్తే మాత్రం ఆ రెండూ ఒకే రేఖ మీదకి వచ్చినట్టు కనిపిస్తాయి.దాన్ని సూర్యుడు ఆ నక్షత్ర రాశిలో ప్రవేశించడం అంటారు.కోపర్నికస్ అనేవాడు భూమి గురించి ఒక నిజం చెప్పినందుకు సజీవదహనం చేసిన వాళ్లకన్నా చాలా ముందుగానే ఆయా విషయాలన్నిట్నీ ఒక శాస్త్ర స్థాయిలో అభివృధ్ధి చేసిన వాళ్ళకి సరిగ్గా ఆ సమయానికి వాతావరణంలో జరిగే మార్పులు కూడా తెలుసు!ఆ రోజు దేవుడి పేరు మీద చెయ్యమని చెప్పిన పూజల్లోనూ వండివార్చి ఆరగింపు చేసి మనం తినాల్సిన నైవేద్యాల లోనూ ఆ వాతావరణానికి దేహంలో జరిగే మార్పులకి ప్రతిక్రియలుగా పనిచేసే ఔషధాల్ని సమకూర్చటం అనే ఆయుర్వేద సూత్రాలు వున్నాయని తెలియకపోతేనే అవి మూఢనమ్మకాలు అవుతాయి!

   ఒక వైపున చంద్రుడు క్షీరసముద్రంలో లక్ష్మీదేవికి సోదరుడుగా పుట్టుకొచ్చాడు,అతను ఓషధుల కధిపతి,మనస్సును భ్రమింప జేస్తాడు అనే పిట్టకధలూ చెప్పారు, మరొక వైపున చంద్రుడు అనేది గోళాకారంగా వున్న గ్రహం,అది భూమి చుట్టూ తిరుగుతుంది అని వ్యాసార్ధాన్ని కూడా కొలిచి సిధ్ధాంతాలూ చెప్పారు?బైబిలుకి విరుధ్ధంగా చెబితే చంపేసిన వాళ్ళు శాస్త్రీయ దృష్టి గలవాళ్ళూ ఆధ్యాత్మికతలోనూ శాస్త్రీయతని ఇముడ్చుకున్న వాళ్ళు అనాగరికులా?మామూలుగా చెప్తే బోరు కొట్టించే విషయాల్ని కల్పిత కధలుగా చెప్పే పురాణ సాహిత్యం అన్ని జాతుల్లోనూ వుంది!నక్షత్ర రాశులు యెలా పుట్తాయి అనే దాని చుట్టూ అల్లిన "క్లాష్ ఆఫ్ థ టైటాన్స్"కి నాలుగో వెర్షన్ ఇప్పుదు హాలీవుడ్డులో నడుస్తాంది?"జాక్ అండ్ థ బీన్ స్టాక్" అనే పేరుతో మనమూ చిన్నప్పుడు చదువుకున్న చిక్కుడు మొక్కతో ఆకాశంలోకి వెళ్ళే కధనే ఇప్పుడు మళ్ళీ "జాక్ అండ్ థ జైంట్ స్లేయర్" పేరుతో మళ్ళీ తీసుకుని సరదాగా సూపర్ హిట్టు చేసుకున్నారు?మనవాళ్లకి ఇదేమి మాయరోగమో మన పురాణ కధల్లో బూతులూ తప్పులూ తప్ప ఇంకెమీ కనబడ్దం లేదు?!ఇంటి ఈగ శ్లేష్మం మీదా తేనెటీగ పువ్వు మీదా వాలినట్టు వీళ్ళ బుధ్ధిలో వున్నదాన్నే అక్కడ చూస్తున్నారా?రామాయణంలో నైనా భారతంలో నైనా మతి తప్పిన భౌతిక్క వాదమూ స్త్రీవాద దళితవాద పైత్యకారి పాండిత్యాలకి పనికొచ్చే అంశాలూ వెతుకుతారు,అవి లేనిదంతా చెత్త అని తీర్మానించేస్తారు?

    వాళ్లు యెటూ అవి మాకక్కర్లేదని చెప్పేశారు గాబట్టి వాళ్లకి పనికి రాకపోయినా అసలు అక్కడేముందో తెలుసుకోవాలనుకునే బుధ్ధిమంతులకి కనీసం వాళ్ళ గందరగోళపు వాదాలకి మతి తప్పకుండా వుండటానికి పనికొస్తాయనే వుద్దేశంతో పౌరాణిక సాహిత్యంలో నిగూఢంగా వున్నవాట్ని గురించి నాకు తెలిసిన విషయాల ఆధారంతో వ్యాఖ్యానించాలని పూనుకున్నాను.రామాయణంలో వాలిని రాముడు అన్యాయంగా చంపేశాడని పొర్లి పొర్లి యేడుస్తున్న వాళ్ళు ఇప్పటికీ వున్నారు?ఇక భారతంలో కర్ణుడికీ యేకలవ్యుడికీ అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వున్నాయి?అవి నిజంగా తప్పులేనా,అసలు అక్కడ మనం తెలుసుకోవలసినదేమిటి అనేవి వివరిస్తాను!

     అర్ధ పాండిత్యం అంటారు గదా, పాండిత్యంలో సగం వుంటుందా?వుంటుంది!దేన్ని గురించయినా యెందుకు తెలుసుకోవాలి?తెలుసుకుని యేమి చేయాలి?మనకి పనికొచ్చేదాన్ని గురించే మనం తెలుసుకోవాలి!తెలుసుకున్నదాన్ని ఆచరణలోకి అనువదించుకోవాలి!అక్కడ వున్నదాన్ని అర్ధం చేసుకోవడం, అర్ధమయిన దాన్ని వుపయోగించుకోగలగడం అనే రెందూ కలిస్తేనే పూర్ణ పాండిత్యం,ఆ రెంటిలో యే ఒక్కటి లోపించినా అర్ధపాండిత్యమే?అంతే తప్ప పాండిత్యంలో 100% మరియూ 50% అంటూ పెర్సెంటేజిలు వుండవు!పౌరాణిక సాహిత్యం పూర్తిగా నైతిక సంబంధమయిన సందేహాల్ని నివృత్తి చెయ్యడానికి వుద్దేశించినవి!వాటిల్లో అనవసరమయిన విషయాల్ని వెదకటమంటే రామాయణంలో పిడకల వేటలా వుంటుంది!అర్ధమయినదాన్ని పనికొచ్చేలా వుపయోగించుకోవటం,అర్ధం కాకపోయినా పనికొస్తుందేమో అనిపిస్తే పూర్ణపండితుల్ని అడిగి తెలుసుకోవటం,అంతే - చెంబు కొద్దీ గంగ!
_______________________________________________________________
చారిత్రక విషాదం   రామకధా వైభవం  రామకధా విశ్లేషణం రామకధా విమర్శనం  రామకధా విజృంభణం

15 comments:

  1. నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను
    --------------------------
    Amen!!

    ReplyDelete
    Replies
    1. ఏం చేయాలి? ఆమెన్ ఏం చేయాలి కొట్టాలా ..... ముద్దు పెట్టుకోవాల??!
      ఊరికే సెటైరు ....ఆమెన్ అని ఊరు కుంటారు ఆ తర్వాత చెప్పరని!!!

      Delete
  2. ముందు తెలిసెనా ప్రభూ - అన్నట్లయింది నాపని?
    ఈపని మొదలెట్టిందే ఆ సెగ ఇంకెవరికీ రాకూడదని!

    ReplyDelete
  3. అద్భుతమండి... మీ విశ్లేషణ... ముందు దేశం నుండి కమ్యూనిష్టులని నిషేధిస్తే, సగం బాగుపడినట్టే. "గీత గురించిన వాదనల్లో క్రైస్తవం ఎంత దారుణమయిన మూడ నమ్మకాల్ని పెంచి పోషిస్తుందో చెప్పాను. డైనోసార్లు అంతరించిపోవడానికి కారణం జలప్రళయం సమయంలో అవి నోవా పడవలో పట్టకపోవడం అని చెపుతున్నాయి. ఎంత దారుణం. .. వీళ్ళందరూ, మన సంప్రదాయాల్ని హేళన చేస్తున్నారు. వాళ్ళది నమ్మకం, విశ్వాసం అయితే, మన సంప్రదాయం ఒక శాస్త్రం. దీనికి నమ్మకంతో పనిలేదు. ఎవ్వరినీ బలవంతం చెయ్యనక్కర్లేదు. ఎప్పటికయినా సత్యమే గెలుస్తుంది.. (సత్యమేవ జయతే)

    ReplyDelete
  4. నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను!ప్రజ బ్లాగులో
    ---------------------
    నాది రచ్చబండలో.
    మనం కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులచే పరిపాలించ బడ్డాము. వాళ్ళేమీ ప్రేమతో పరిపాలించలేదు. వారికి ఇష్టమయినవీ అవసరమయినవీ తీసుకున్నారు. వాళ్ళ పేరుకి, తెలివితేటలకి అడ్డువచ్చేవన్నీ రూపు రేఖలు కనపడకుండా నాశనం చేశారు (systematic destruction). అది తెలిసి ఉండి కూడా స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కూడా మనల్ని పరిపాలించమని కాళ్ళకి మొక్కుకుని వాళ్ళ చేతుల్లోనే పెట్టాము. వీటన్నిటి మూలాన జరిగింది ఒకటే, మన చరిత్రా, సంస్కృతి మనకి తెలియదు (వాళ్ళు చెప్పింది తప్ప) . తెలుసుకోటానికి కూడా ప్రయత్నించం. ఎందుకంటే ఏళ్ళ బానిసత్వం మన బుర్రని పాడు చేసింది (Brainwash).
    మీ పోస్ట్ చాలా బాగుంది. ఇటువంటివి మీ దగ్గర నుండి ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటా.

    ReplyDelete
  5. >నేను ఈమధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను!ప్రజ బ్లాగులో గీత గురించి ఒక ప్రశ్న వేస్తే కొందరితో వాదన మొదలెట్టాక క్షేమంగా ఇందులోంచి బయట పడగలనా,యెరక్కపోయి ఇరుక్కున్నాను గదా అని పరితపించాల్సిన దుస్థితి యెదుర్కొన్నాను.

    హరిబాబుగారూ, జరిగిందేదో జరిగిపోయింది. దానికి వగచి ప్రయోజనం లేదు. చర్చావేదికలలో నోరువిప్పటం అనేది రోటిలో తలదూర్చటం వంటిదే. అక్కడికి వినయశీలురూ వచ్చి మాట్లాడుతూ ఉండవచ్చును, అవినయబుధ్ధులూ వచ్చి మాట్లాడుతూ ఉండవచ్చును. కొందరు పొరబడి రావచ్చును, కొందరు చొరబడి రావచ్చును. అటువంటి చోట్ల అందరూ యథాశక్తి మాట్లాడటమే, అరవటమే కాని తేలేది యేమీ ఉండదు. ఈ‌ చర్చలు ముందుముందు కాలంలో రిఫరెన్సులుగా ఉపయోగిస్తాయన్న భ్రమ కొందరికి ఉండవచ్చును. ఈ కాలంలో కామెంట్ల పంటగా ఉన్నాయన్న స్పృహ కొందరికి ఉండవచ్చును. కాని ఇవన్నీ నా దృష్టిలో నిరుపయోగిచర్చలు. చర్చించటానికి సంబంధిత విషయపరిజ్ఞానం అనవసరమనే భావన కూడా వ్యాప్తిలోకి వచ్చాక ఇంక ఎవరికీ ఎవరూ చెప్పదగ్గవారు కాదని విస్పష్టం. ఈ చర్చల్లో తలదూర్చి ఎవరి అనుభవాలు వారు పొందాక, ఆ అనుభవాలను గమనించి మరికొందరు విజ్ఞులు జాగరూకతతో మెలగుతారని అశించటం మాత్రమే చేయగలం. అసక్తి ఉన్నవారు చర్చించుకోనివ్వండి.

    ReplyDelete
    Replies
    1. మాష్టారూ, నేను ఈ పోష్టునీ దీనికి కొనసాగింపుగా కొన్ని పోష్తులూ వెయ్యటానికి ప్రేరన కూడా అదే కాబట్టి పెద్దగా వ్యధ అంటూ యేమీ లేదు!కేవలం మాటగా పరితాపం అనేది వాడానే తప్ప నాది క్షాత్ర సహజ స్వభావం,పోరాడే అవకాశం వస్తే యెన్ని సార్లయినా ముందుకే దూకుతాను.గెలిచావా ఓడావా నేది చూసుకోకుండా "యుధ్ధం కోసమే యుధ్ధం చేఇనట్లయిన పాపమంటదు నీకు" అనే గీతావాక్యం నన్ను యెప్పటికీ అట్లాంటి పోట్లాటలకి హుషారుగానే వుంచుతుంది?!అక్కడ కూడా నేను గెలిచాననే అనుకుంటున్నాను!

      Delete
  6. >>> 17వ శతాబ్దంలో జాన్ డాల్టన్ కనుక్కున్న అణుధర్మ శాస్త్రం గురించి డాల్టన్ కన్న 2,500 సంవత్సరాలకి పూర్వమే ఆచార్య కణాదుడు ఇక్కడ ప్రతిపాదించాడు!

    >>> న్యూటన్ పేరు మీద గురుత్వాకర్షణ శక్తి నియమంగా చదువుకుంటున్నాం.కానీ ఈ మాటలు క్రీ.శ 400-500 మధ్యన జీవించిన భాస్కరాచార్యు డనే భారత దేశపు ఖగోళ శాస్త్రవేత్త రచించిన "సూర్య సిధ్ధాంత" మనే గ్రంధం లోనివి!

    >>> క్రీ.శ 499లోనే తన "ఆర్యభటీయం"లో, కోపర్నికస్ ద్వారా మనం తెలుసుకున్న దానికి 1000 సంవత్సరాలకు ముందే భూమి గుండ్రంగా వుంటుందనీ అది సూర్యుడి చుట్టూ ఒక అక్షం మీద పరిభ్రమిస్తుందనీ చెప్పాడు

    ఇవి నిజమా కాదా అన్న చర్చలోకి నేను వెళ్ళను కానీ, ఒకటి మాత్రం వాస్తవం. ఇటువంటి ఎన్నో ఆవిష్కరణలు వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో జరిగిన మాట వాస్తవం. కాని దురదృష్ట వశాత్తూ ఆ శాస్త్రాభివృద్ధి అక్కడితో అంతరించి పోయిందే తప్ప కొనసాగించబడలేదు. అందుకు ఒకరిని నిందించే పని లేదు. కుల చట్రాల్లో విద్యను బిగించి మనమే చేతులారా చేసుకున్న పని అది! అనువంశికంగా సంక్రమణం చెందే విద్య మధ్యలో ఒక శుంఠ జన్మిస్తే చాలు, అంతరించి పోతుంది. మనకు అదే జరిగింది. అదే సమయంలో యూరపియన్లు విద్యను ధారాళంగా వ్యాపింప జేశారు, కాబట్టి అక్కడ అది అభివృద్ధి చెందింది. ఇప్పటికైనా మనం వాస్తవాన్ని గుర్తిస్తే ముందు తరాలకు మేలు జరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. ఇవ్వన్నీ ఒక మిత్రుడు స్థల కాలాల్నీ కొన్ని సూత్రాలకి అన్వయం కూడా చూపిస్తూ ఆధారాలతో సహా ఒక డాక్యుమెంతుని పంపాడు నా మెయిలుకి.ఇక్కడా అందులోనుంచి కొన్నిట్ని మాత్రమే అదీ క్లుప్తంగా చెప్పాను.

      Delete
  7. *కుల చట్రాల్లో విద్యను బిగించి మనమే చేతులారా చేసుకున్న పని అది *
    మీరు జస్టిస్ పార్టి (ఇందులో ఆంధ్రావాళ్లు ఉన్నారు) దాని వారసులు ద్రవిడ పార్టిలు,కమ్యునిస్ట్ పార్టి బ్రాహ్మణుల మీదచెసిన ప్రాపగండాను ఇంకా నమ్మటం ఆశ్చర్యంగా ఉంది.వీలు చూసుకొని సమాధానం ఇస్తాను.

    ReplyDelete
  8. >>"యురేఖా తకమిఖా" అని పాడుకుంటూ వొంటిమీద బట్ట వుందాలేదాని కూడా చూసుకోకుండా రెచ్చిపోయినట్టు
    >>?మనవాళ్లకి ఇదేమి మాయరోగమో మన పురాణ కధల్లో బూతులూ తప్పులూ తప్ప ఇంకెమీ కనబడ్దం లేదు?!
    >>భారతంలో కర్ణుడికీ యేకలవ్యుడికీ అయితే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వున్నాయి
    అంతేలెండి హరిబాబు గారు! మనం చెస్తే శ్రుంగారం.. వాడు చేస్తే పిచ్చి తక మిక డాన్సులు మరి..
    ఆ పెద్ద పేరు లేని ఫ్రెంచి మహిళ పేరు.. మీకెలా తెలిసిందో చెపితే సంతొషిస్తాం

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @Chiranjeevi Y
      మీ మొదటి అతికింపుడుకి సంబంధించినది దానికి అతనన్న మాతకి మనకి ఇక్కడో సరదా పాట వుంది కదా అని ఒక జోకు వేశా,అందులో కూడా మీకు మీ చుట్టాలని విమర్శించినంత బాధ చూస్త్న్నాను,అదేమిటో?నాకు మాత్రం జోకేఅసే చాన్సు వస్తే మన-పర తేడా వుండదు!

      రెండో అతికింపుడుని మీరు యెందుకు పేర్చారో తెలియదు గానీ పడమటి వాళ్ళు ఇప్పటికీ "హెర్క్యులిస్" , "క్లాష్ ఆఫ్ ది టైటాన్స్" లాంటివాటికి కొత్త వెర్షన్లు తీసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారు!డాన్ బ్రౌన్ వాళ్ళ నీచత్వాలన్నీ బయట పెట్టినా యే మాత్రం సిగ్గు పడకుండా అవి పాత తప్పులులే ఇప్పుడు చెయ్యటం లేదుగా అని సరిపెట్టేసుకుని తమ పురాణ కధల్ని ఆకర్షణీయంగా ప్రపంచం మొత్తానికీ చూపిస్తున్నారు,యెందుకో?

      Delete
  9. హరిబాబు గారు! ఇంకొకరు సాధించిన దాన్ని మీరెంత నీచంగా చూసారో చెప్పత్టమే నా వుద్దేశం. సమాధానం దగ్గరలెనప్పుడే ఈ అతికింపులు, సకిలింపులు అని వొస్తాయి. ఇంకొకల్ని యెగతాళి చెయ్యగానే , ఆహా వోహో అంటూ మీ భజన బ్రుంధంలో కలిసే వాడ్ని కాదు లెండి. శుభం

    ReplyDelete
    Replies
    1. @Chiranjeevi Y
      భజన నాకూ అక్కర్లేదు,సరదాగా చేసానని చెప్పినా దురుద్దేశం ఆపాదిస్తే నేను చెయ్యగలిందేముంది?హాస్యంగా రాయటం నా పోష్టు లన్నిట్లోనూ వుంది!మీరు ఇంకొకరు చేసిందాన్ని వెక్కిరించతం అంతూన్నారు గానీ మన దేశస్థుడొకడు వాళ్ళ కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందే కనుక్కున్నా ఆ విషయం స్పష్టంగా తెలిశాక కూడా గుర్తింపు రాకపోవడానికి మీలాంటి వాళ్ళే కారణమని నాకు స్పష్టంగానే తెలుసులెండి?!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...